: ఆ మైలురాయికి చేరువలో కొల'వెర్రి' పాట!
‘కొలవెరి కొలవెరి కొలవెరి డి’ పాట రికార్డు సృష్టించి మూడేళ్లయింది. ఆ రికార్డు జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక మాధ్యమాలు, ఎఫ్ఎం రేడియోలు, టీవీల్లో ఈ పాట వినపించని రోజు లేదు. ఈ మాస్ సాంగ్ ను ఇప్పటివరకు యూట్యూబ్ లో వీక్షించిన వారి సంఖ్య తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షలు. త్వరలో ఈ సంఖ్య 10 కోట్ల మైలురాయిని చేరుకోనుంది. బట్లర్ ఇంగ్లీషు పదాలతో సరదాగా సాగే ఈ 'కొలవెరి డి' పాటను హీరో ధనుష్ వినసొంపుగా పాడిన సంగతి తెలిసిందే!