: అభ్యర్థుల పేర్లు ఓటర్లను ప్రభావితం చేస్తాయా?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పురాణ పాత్రల్లోని రాముడు, శ్యాముడు, శివుడు, శత్రుఘ్నుడు, అర్జునుడు, శకుని, ప్రహ్లాదుడు అనే పేర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. వీళ్లతో పాటు ఒక స్వాతంత్ర్య సమర యోధుడి పేరు కూడా ఉంది. ఆ పేరే నేతాజీ సుభాష్ చంద్రబోస్! ఈ పేర్లతో ఉన్న అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మరికొన్ని చోట్ల శ్యాం, కృష్ణ పేర్లు కలిగిన అభ్యర్థులు, శివ పేరు గల ప్రత్యర్థులను ఢీకొంటున్నారు. బీహార్ లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో రామ్ అనే పేరున్న ఉన్న అభ్యర్థులు ప్రతిచోటా ఉన్నారు. ఈ విశ్లేషణను రంజీవ్ అనే రాజకీయ విశ్లేషకుడు చేశారు. బీజేపీ, ఎల్జేపీ, ఆర్ ఎల్ఎస్పీ, హెచ్ఏఎంలతో కూడిన ఎన్డీయే కూటమే కాదు... జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూడిన మహాకూటమి, వామపక్షాల నుంచి కూడా పలువురు రామ్ పేరుగల అభ్యర్థులు పోటీ పడుతున్నారు.