: తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన ధావన్
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కష్టాలు తప్పేలా లేవు. 304 పరుగుల విజయలక్ష్యంతో టీమిండియా ఇన్నింగ్స్ ను స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (25 బ్యాటింగ్)తో కలిసి శిఖర్ ధావన్ (23) ప్రారంభించాడు. తొలి మూడు ఓవర్ల దాకా కాస్త నింపాదిగానే ఆడిన రోహిత్, ధావన్ లు ఆ తర్వాత హిట్టింగ్ ప్రారంభించారు. అయితే ఈ హిట్టింగ్ జోడిని సఫారీలు నిమిషాల వ్యవధిలోనే విడదీసి టీమిండియాకు షాకిచ్చారు. మోర్నీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ మూడో బంతికి ధావన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో 42 పరుగుల వద్దే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ధావన్ నిష్క్రమణతో అజింక్యా రెహానే (7) క్రీజులోకి వచ్చాడు. పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది.