: నగరంలోని రేస్ కోర్సుల్లో వందల కోట్ల గ్యాంబ్లింగ్ జరుగుతోంది: తలసాని
హైదరాబాద్ లోని రేస్ కోర్సుల్లో అనధికారికంగా వందల కోట్ల గ్యాంబ్లింగ్ జరుగుతోందని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లించడం లేదని మీడియాతో చెప్పారు. గత వారంలో అధికారుల తనిఖీల్లో రూ.51 లక్షలు పట్టుబడినట్టు తెలిపారు. ఇకపై ప్రతి ఆదివారం వాణిజ్య పన్నుల శాఖ దాడులు చేస్తుందన్నారు. రేస్ కోర్సులను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వం తరపున నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాల బంద్ పూర్తిగా విఫలమైందని, వారిని రైతాంగం నమ్మడం లేదని ఆరోపించారు.