: అమరావతి నిర్మాణానికి త్వరలో పర్యావరణ అనుమతులు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి త్వరలో పర్యావరణ అనుమతులు రానున్నాయని తెలిసింది. ఈ మేరకు సీఆర్ డీఏ అధికారులకు పర్యావరణ అనుమతుల కమిటీ నుంచి సమాచారం అందింది. ఈ నెల 12, 13 తేదీల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 22న శంకుస్థాపన జరగనుంది. ఇదిలా ఉంచితే, ఇప్పటికే గుంటూరులోని రాజధాని ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఆహ్వానపత్రం కూడా ఇప్పటికే సిద్ధమైంది.