: కేబినెట్ భేటీలో రాజధాని ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు


ఏపీ రాజధాని ఆహ్వాన పత్రాన్ని మంత్రివర్గ సమావేశంలోనే సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మంత్రులకు, అధికారులకు కూడా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రేపటి నుంచే శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వాన పత్రాళు ఇచ్చి, పలువురిని ఆహ్వానించనున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం కేబినెట్ భేటీ జరుగుతోంది. రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News