: ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి: కేటీఆర్


తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విపక్ష పార్టీలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడు విపక్షాలు ఒకటిగా కలసి పోరాడలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటై బంద్ చేయడం ఆశ్చర్యపరిచే విషయమని అన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే బంద్ కు పిలుపునిచ్చారని విమర్శించారు. సికింద్రాబాద్ బ్లూ ఇంపీరియల్ గార్డెన్ లో 'జిటో బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్ పో-20'15 జరుగుతోంది. ఈ ఎక్స్ పోకు కేటీఆర్ సహా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తమతో విపక్షాలు కలసి రాకపోయినా ప్రజల భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News