: తనయుడి ఆరోగ్యంపై జగన్ తల్లి విజయమ్మ ఆందోళన
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో, ఆయన తల్లి విజయమ్మ ఈ ఉదయం దీక్షాస్థలికి వచ్చారు. ఈ సందర్భంగా తన కుమారుడి ఆరోగ్యంపై ఆరా తీశారు. నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో... జగన్ నీరసిస్తున్నారని, ఆయన పల్స్ రేట్ కూడా గంటగంటకూ పడిపోతోందని విజయమ్మకు డాక్టర్లు తెలిపారు. దీంతో, తన కుమారుడి ఆరోగ్యం పట్ల విజయమ్మ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు, దీక్ష కొనసాగిస్తున్న జగన్ ను పలువురు విద్యార్థినీ విద్యార్థులు కలసి తమ సంఘీభావం ప్రకటించారు.