: ఇంద్రాణి ముఖర్జియా మూత్ర నమూనాల్లో 'కొకైన్'
కన్న కూతురు షీనా బోరాను హత్య చేసిన ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె కేసు రోజుకో మలుపు తిరుగుతూ దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా, ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. ఈ సందర్భంగా, ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె మూత్ర నమూనాల్లో కొకైన్ అనే డ్రగ్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో, ఇంద్రాణి శాంపిల్స్ ను భద్రపరచాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. అయితే, జైల్లో ఉన్న ఇంద్రాణికి డ్రగ్స్ ఎలా అందాయనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. మరోవైపు, ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహించిన పరీక్షల్లో ఇంద్రాణి ముఖర్జియా అవసరానికి మించి అత్యధిక మోతాదులో ఎలాంటి మందులు వాడలేదని తేలింది.