: 'గ్యాంగ్ రేప్' వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన మంత్రి


నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం, ఆందోళన వ్యక్తం కాగానే క్షమాపణలు చెప్పడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా, ఇద్దరు చేసిన అత్యాచారాన్ని 'గ్యాంగ్ రేప్' అనకూడదని, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది చేస్తేనే గ్యాంగ్ రేప్ అవుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోం మంత్రి కేజే జార్జ్ క్షమాపణలు కోరారు. ఒకరు చేసినా ఎంతమంది చేసినా దానిని అత్యాచారమంటారనే భావనతోనే తానా వ్యాఖ్యలు చేశానని ఆయన చెప్పారు. కాగా, బెంగళూరులో ఓ కాల్ సెంటర్ లో పని చేస్తూ విధులు ముగించుకుని వస్తున్న యువతిని డ్రాప్ చేస్తామని చెప్పి, వ్యాన్ ఎక్కిన తరువాత కత్తులు చూపి బెదిరించి, వ్యాన్ ను నిర్మానుష్య ప్రాంతాల్లో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయనను వివరణ అడుగగా, ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ అనరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసి, కేసును సుముటోగా స్వీకరించి, ఆయనకు నోటీసులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News