: వయస్సు పైబడకుండా ఉండాలంటే...!
పొగ, మద్యం తాగే అలవాట్లు ఎక్కువగా ఉంటే తొందరగా వయస్సుపై బడుతుంది. డీఎన్ఏలో మార్పులు సంభవించి.. మన అసలు వయస్సు కంటే పెద్దవాళ్లుగా కనపడతామని పరిశోధకులు అంటున్నారు. వాషింగ్టన్ లోని అయోవా యూనివర్శిటీకి చెందిన పలువురు నిపుణులు డీఎన్ఏ మిథైలేషన్ పై పలు పరిశోధనలు నిర్వహించారు. పొగతాగేవారు, మద్యం తాగే వారి డీఎన్ఏను, మిగతావారి డీఎన్ఏను పోల్చి చూడగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మోతాదుకు మించకుండా మద్యం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని పరిశోధకులు అంటున్నారు.