: దసరాకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు... 200 కి.మీ దాటిన ప్రాంతాలకు అదనపు ఛార్జీలు
దసరా పండుగ నిమిత్తం హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కేటాయించింది. నగరం నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు 3,885 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలిపింది. ఈ బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్ సుఖ్ నగర్, నగర శివార్ల నుంచి బయలుదేరనున్నాయి. ఈ నెల 8,10, 11, 16 నుంచి 21 వరకు నడిపే ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. ఈ సమయంలో పలు ప్రాంతాలకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. 200 కిలోమీటర్లు దాటి వెళ్లే బస్సులు, ఏపీకి వెళ్లే అన్ని బస్సుల్లోనూ 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు.