: ఉండవల్లీ...నీకిది తగదు!: వీహెచ్


ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై చట్టంపై చర్చ జరగాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పుస్తకం ఇవ్వడం సరికాదని తెలంగాణ ఎంపీ వీహెచ్ హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజనపై మరోసారి చర్చ జరగాలని రాష్ట్రపతికి ఉండవల్లి పుస్తకం ఇవ్వడం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని అవమానించడమేనని అన్నారు. సోనియా గాంధీని అవమానించడం ఉండవల్లికి తగదని ఆయన చెప్పారు. విభజన సమయంలో రాష్ట్రపతి బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపారని, అప్పుడు చర్చించకుండా తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలోనే చర్చ జరగనప్పుడు అది తప్పు అనే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. కులం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్న హార్దిక్ పటేల్ ను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం ఒక్కొక్కరితో ఒక్కొక్కలా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News