: అంగారకుడిపై పురాతన సరస్సుల జాడ: నాసా గుర్తింపు
3.3 నుండి 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై నీటి ప్రవాహాలు, సరస్సులు ఉన్నాయని చెప్పడానికి తమకు ఆనవాళ్లు దొరికాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రకటించింది. క్యూరియాసిటీ రోవర్ అందించిన సమాచారం ఆధారంగా నాసా శాస్త్రవేత్తలు అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది. అంగారక గ్రహంపై నీరుందనడానికి ఈ ఆనవాళ్లు చాలని పేర్కొంది. అంగారక గ్రహంపై నీటి జాడలకు సంబంధించి గతంలో కూడా బోలెడన్ని ఆధారాలు నాసాకు లభించాయి. అయితే, ప్రసుత్తం లభించిన ఆనవాళ్లతో పరిశోధనలకు మరింత ప్రయోజనం ఉంటుంది.