: రేపటి బంద్ ను విజయవంతం చేసి రైతులకు మద్దతునివ్వండి: ఎర్రబెల్లి
రేపటి బంద్ ను విజయవంతం చేయాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రైతులకు మద్దతునివ్వాలంటే రేపటి బంద్ లో పాల్గొనాలని సూచించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి అవి కనపడడం లేదని, దానిని నిలదీసినందుకు శాసనసభ నుంచి విపక్షాలను సస్పెండ్ చేశారని అన్నారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుధర కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రేపటి బంద్ ఒక మార్గమని ఆయన తెలిపారు. రేపటి బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.