: ఒక చేతిలో గొడ్డలి..మరొక చేతిలో భార్య తల!


భార్య తలను నరికి చేతిలో పట్టుకుని రోడ్డుపై ఆ వ్యక్తి నడచుకుంటూ వెళ్లిన దారుణ సంఘటన ఒకటి మహారాష్ట్రలోని పూణేలో ఈరోజు ఉదయం జరిగింది. ఈ సంఘటన వివరాలు... వాచ్ మ్యాన్ గా పనిచేసి జీవనం సాగిస్తున్న అరవై సంవత్సరాల రామచంద్ర చవన్ కు అతని భార్య (55)పై అనుమానం. ఎవరితోనో వివాహేతర సంబంధముందన్న అనుమానంతో ఆమె తలను నరికేశాడు. ఒక చేత్తో గొడ్డలి, మరో చేతిలో భార్య తలకాయను పట్టుకుని పూణే నడివీధుల్లో నడచుకుంటూ వెళ్తున్న ఆ వ్యక్తిని చూసి ప్రజలు భయపడిపోయారు. అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ వృద్ధుడిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News