: నాలుగేళ్లలో ఆమె... అతడుగా మారిన క్రమంబెట్టిదనిన...!


లండన్ సమీపంలోని ఎసెక్స్ యూనివర్సిటీలో సైకాలజీ విద్యార్థిని జేమీ రైన్స్ నాలుగేళ్ల కష్టం ఫలించింది. జేమీకి సరిగ్గా నాలుగేళ్ల వయసప్పుడు తాను మిగిలిన వారికంటే భిన్నంగా ఉండడం గుర్తించింది. ఎనిమిదేళ్ల వయసప్పుడు జుత్తు కత్తిరించుకుని అద్దం ముందుకెళ్తే అచ్చం అబ్బాయిలా అనిపించిందట. అప్పుడే తాను అబ్బాయి అయిపోయినట్టు ఊహించుకునేదట. తరువాత నెమ్మదిగా అమ్మాయిల పట్ల ఆసక్తి కలగడం ప్రారంభమైంది. దీంతో తన గర్ల్ ఫ్రెండ్ షాబాను విరివిగా కలుసుకునేది. ఇలా లాభం లేదని, ఎలాగైనా అబ్బాయిగా మారాలని నిర్ణయించుకుంది. దీంతో 18 ఏళ్లు వచ్చాక టెస్టోస్టిరోన్ హార్మోన్ తీసుకోవడం ప్రారంభించింది. అలా చేయడంతోపాటు ప్రతిరోజూ తన శరీరంలో వస్తున్న మార్పులతో సెల్ఫీ తీసుకునేది. లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకోవడంతో పాటు, మూడేళ్ల పాటు మందులు వాడింది. దీంతో పూర్తి స్థాయి మగాడిగా మారింది. ఆమె నుంచి అతడుగా మారే క్రమంలో తీసుకున్న సెల్ఫీలతో ఓ వీడియో తయారు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఈ వీడియోను 7 లక్షల మంది వీక్షించారు. ఇది చూసిన ఓ న్యూస్ ఛానెట్ ఆమెతో 'గర్ల్ టు మెన్' అనే డాక్యుమెంటరీ తీసేందుకు సిధ్ధమైంది. లింగమార్పిడిలో నాలుగేళ్లుగా పరిచయమున్న గర్ల్ ఫ్రెండ్ షాబా చాలా సహాయపడిందని ఆమె తెలిపింది. త్వరలో వీరు వివాహం చేసుకోనున్నారు. ఇందుకు ఇరు కుటుంబాలను కూడా ఒప్పించారు.

  • Loading...

More Telugu News