: ఆటోను ఢీ కొట్టిన బస్సు: 27 మందికి గాయాలు


అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని మడకశిర రైల్వేగేటు వద్ద ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు గొయ్యిలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 27 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News