: నేను దెయ్యం అయితే, మోదీ బ్రహ్మ పిశాచి: లాలూప్రసాద్


‘నేను దెయ్యం అయితే, నరేంద్ర మోదీ బ్రహ్మ పిశాచి’ అంటూ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.‘లాలూ దెయ్యం’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖలు తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు లాలూ ప్రసాద్ కూడా అదే స్థాయిలో తీవ్ర విమర్శలు చేశారు. మోదీ తనను విమర్శించడం ద్వారా యాదవులందరినీ కించపరిచారంటూ లాలూ మండిపడ్డారు. నరేంద్ర మోదీకి ప్రధాని కావాల్సిన అర్హత లేదని విమర్శించారు. దళితులకు, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలన్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ కుట్రను తాను నిరసించినందువల్లే తనపై విమర్శలు గుప్పిస్తున్నారని లాలూ ప్రసాద్ అన్నారు.

  • Loading...

More Telugu News