: బంద్ విఫలం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది: పొన్నం
ఓ వైపు రైతులు, ఆశా వర్కర్లు ఆందోళనలో ఉంటే, మరోవైపు బతుకమ్మ సంబరాలు జరపడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. వాళ్ల సమస్యలపై పోరాడుతున్న ఆశా వర్కర్లను అణచివేయడం సరికాదని అన్నారు. తెలంగాణలోని విపక్షాలన్నీ కలసి రేపు తలపెట్టిన బంద్ ను విఫలం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, రేపటి బంద్ సక్సెస్ కావడం ఖాయమని చెప్పారు.