: చంద్రబాబు విగ్రహం ఇదిగో...!
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నీరాజనాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ఆయనకు ఏకంగా గుడి కట్టడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు వల్ల తమ భూముల విలువ కోట్లకు పెరిగిందని వారు సంతోషపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు గుడే కాదు... పలు చోట్ల కాంస్య విగ్రహాలు, మరికొన్న చోట్ల రాతి విగ్రహాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు విగ్రహాల తయారీ కూడా జరిగిపోతోంది. పక్క ఫొటోలో ఉన్నది తయారీలో ఉన్న చంద్రబాబు బస్ట్ సైజ్ కాంస్య విగ్రహం. విగ్రహ తయారీదారులు ఎంతో జాగ్రత్తగా విగ్రహాన్ని తయారు చేస్తున్న దృశ్యాన్ని ఫొటోలో మనం చూడవచ్చు.