: స్పెయిన్ ప్రభుత్వాన్ని మోసం చేసిన ఫుట్ బాల్ స్టార్ మెస్సీ... జైలుశిక్ష తప్పదు!


బార్సిలోనా ఫుట్ బాల్ స్టార్, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న లియోనెల్ మెస్సీ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. ఆయన నేరం చేసినట్టు పక్కా ఆధారాలు కోర్టు ముందుండగా, స్పెయిన్ చట్టాల ప్రకారం ఆయనకు 22 నెలల జైలుశిక్ష ఖాయంగా పడనున్నట్టు తెలుస్తోంది. మెస్సీతో పాటు ఆయన తండ్రి జార్జ్ హొరాసియోలు 2007 నుంచి 2009 మధ్య పన్ను నేరాలకు పాల్పడ్డారని స్టేట్ అటార్నీ కోర్టుకు తెలిపింది. ఆ రెండేళ్లలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన 4.5 మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 31 కోట్లు) వారు చెల్లించలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. తొలుత తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసిన మెస్సీ, ఆపై ఎవిడెన్స్ పక్కాగా ఉండేసరికి తన మాజీ ఆర్థిక సలహాదారు చేసిన తప్పు అదని వాదించాడు. తన కుమారుడు నిర్దోషని, అతని ఆర్థిక వ్యవహారాలకు తానే బాధ్యుడినని మెస్సీ తండ్రి జార్జ్ కోర్టు ముందు మొరపెట్టుకున్నా, ఇద్దరికీ శిక్ష తప్పదని తెలుస్తోంది. కాగా, ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని పొందుతున్న ఆటగాళ్లలో మెస్సీ నాలుగోవాడు.

  • Loading...

More Telugu News