: చంద్రబాబు పెదనాన్న కొడుకు కృష్ణమనాయుడు కన్నుమూత


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పెదనాన్న కుమారుడు నారా కృష్ణమనాయుడు (82) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన చంద్రబాబు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లె లోని సొంతింటిలో వృద్ధాప్యం కారణంగా మరణించారు. దీంతో నారావారిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితర నాయకులు కృష్ణమనాయుడు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News