: ఫ్రాన్స్ లో హీరోగా నిలిచిన సైనికుడిని కాలిఫోర్నియాలో చావగొట్టారు!


గడచిన ఆగస్టు నెలలో ఫ్రాన్స్ లో ప్రయాణిస్తున్న రైలుపై జరిగిన ఉగ్రదాడిని నిలువరించి హీరోగా నిలిచిన సైనికుడు అతను. పేరు స్పెన్సర్ స్టోన్. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ, గురువారం తెల్లవారుఝామున అతనిపై దాడి జరిగింది. కాలిఫోర్నియా సమీపంలోని సాక్రామెంటోలో అతన్ని కొట్టి పడేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన స్టోన్ ను ఆసుపత్రికి తరలించామని, అతని ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, స్టోన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి పారిస్ లో హైస్పీడ్ రైల్లో ప్రయాణిస్తుండగా, తుపాకీ కాల్పులు వినిపించాయి. చూస్తే, ఆయుధాలు ధరించిన వ్యక్తులు ప్రయాణికులను బెదిరిస్తూ కనిపించారు. దీంతో రంగంలోకి దిగిన వీరు వారితో పోరాడి వందలాది మందిని రక్షించి ప్రశంసలు పొందారు. అయితే, నిన్న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అతనిపై దాడి జరిగిందని, అంతకుమించి వివరాలు చెప్పలేమని అధికారులు వెల్లడించారు. ఓ అల్లరిమూక అతనిపై దాడి చేసి వుండవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News