: భక్త జనసాగరమైన అలహాబాద్


అశేష భక్త జనంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అలహాబాద్ లోని త్రివేణీ తీరం కిటికిటలాడుతోంది. దేశం నలుమూలల నుంచీ పవిత్ర స్నానం కోసం భక్తులు పోటెత్తారు. ఈ రోజు మౌని అమావాస్య పర్వదినం కావడంతో పుణ్య నదిలో స్నానాల కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నానికే 30 లక్షల మంది పవిత్ర స్నానాలు పూర్తి చేసుకున్నారు. తొక్కిసలాట జరగకుండా, భక్తులు ఒక క్రమ పద్ధతిలో వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

13 అఖారాలకు చెందిన సాధువులు ఈ రోజు రెండో పవిత్ర స్నానం చేస్తారు. సంక్రాంతి రోజు తొలి పుణ్యస్నానం పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్రివేణిలో వీరి స్నానం కోసం అధికారులు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. అఖారా సాధువులు మూడో పుణ్యస్నానాన్ని వసంత పంచమి నాడు చేయనున్నారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి తదితర ప్రాంతాల్లోనూ గంగా నదిలో భక్తులు నేడు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News