: హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం


హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 22న సంపన్న కుటుంబానికి చెందిన యువతిని ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి కూకట్ పల్లి దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందని భావించిన సదరు యువతి, గత నెల 25న నేరుగా మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో కేసు నమోదు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, నిందితులు నిజాంపేటకు చెందిన సంకు రమణ, కాసగోని రాజేష్, కిరణ్ లను తక్షణం అరెస్టు చేయాలని మేజిస్ట్రేట్ కోర్టు మాదాపూర్ పోలీసులను ఆదేశించింది. దీంతో విషయం వెలుగు చూసింది.

  • Loading...

More Telugu News