: మోసానికి పాల్పడ్డ కన్నడ సినీనటి అరెస్టు


మోసానికి పాల్పడిన కేసులో మరియా సుసైరాజ్ అనే కన్నడ నటిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజన్సీ ద్వారా హజ్ యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి.. అర్థాంతరంగా టిక్కెట్లు రద్దు చేసి డబ్బు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ విధంగా ఆమె సుమారు రూ.2.60 కోట్ల మోసానికి పాల్పడిందని ఆరోపణలు. కాగా, గతంలో నిర్మాత నీరజ్ గ్రోవర్ హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాలు ధ్వంసం చేసిన కేసులో మూడేళ్లు ఆమె జైలులో వుండి వచ్చింది.

  • Loading...

More Telugu News