: సినీ మాక్స్ లో రకుల్ సందడి... 'బ్రూస్ లీ' విశేషాలు చెప్పిన ముద్దుగుమ్మ
బాలీవుడ్ బాటలోనే ఇప్పుడు టాలీవుడ్ నడుస్తోంది. సినిమాల ప్రమోషన్ కు బాలీవుడ్ తారలు వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. తమ సినిమాను మరింత చేరువ చేసేందుకు టాక్ షోలు, ప్రైవేటు ఫంక్షన్లు, సినిమా ధియేటర్లలో ప్రేక్షకులను కలవడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు రామ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న 'బ్రూస్ లీ' సినిమాకు కూడా ఇలాగే భారీ ప్రమోషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులోని సినీ మ్యాక్స్ లోని బ్లూఫాక్స్ లో సందడి చేసింది. బ్రూస్ లీ సినిమా విశేషాలను మీడియా, అభిమానులతో పంచుకుంది. రకుల్ ను చూసిన అభిమానులు హర్షాతిరేకంతో కేరింతలు కొట్టారు.