: తప్పు భర్తది...శిక్ష భార్యకి!


సౌదీ అరేబియాలో సోషల్ మీడియాపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ దేశ పరువు ప్రతిష్ఠలకు ఏమాత్రం భంగం వాటిల్లినా సహించేది లేదని తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తాను ఇంట్లో లేనప్పుడు తన భర్త పనిమనిషితో చేసిన రాసలీలను సీక్రెట్ కెమెరాతో చిత్రీకరించింది. తన భర్త నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పెట్టి బాహ్యప్రపంచానికి తెలియజెప్పింది. ఆమె వీడియో పెట్టిన 12 గంటల్లోపే 25 వేల మంది దానిని షేర్ చేసుకున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ ప్రభుత్వం సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించింది. అయితే సౌదీ చట్టాల ప్రకారం మొబైల్ లేదా సీక్రెట్ కెమెరా ద్వారా ఎవరి వ్యక్తిగత సమాచారాన్నైనా చిత్రీకరించడం నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు గాను ఆమె 87 లక్షల రూపాయల జరిమానా చెల్లించాలి లేదా ఏడాది జైలు శిక్ష అనుభవించాలి. ఇదిలా ఉంచితే, భార్యతో కాకుండా ఇతరులతో అక్రమ సంబంధం నెరపుతున్నట్టు రుజువైతే దానికి భర్త మరణశిక్ష విధిస్తారు.

  • Loading...

More Telugu News