: బెలారస్ రచయిత్రిని వరించిన నోబెల్ సాహిత్య పురస్కారం
బెలారస్ కు చెందిన ప్రఖ్యాత రచయిత్రి స్వెట్లానా అలెక్సీ విచ్ ను ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. 2015 సంవత్సరానికి గాను నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ఆమెకు ఇవ్వనున్నట్లు స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి సారా డానియస్ ప్రకటించారు. స్వెత్లానాకు ఈ పురస్కారం లభించడంపై పలువురు సాహిత్యకారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, రష్యన్ పాలనపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టి రాసిన రచనలు, చెర్నోబిల్ అణు ప్రమాదంలో మృతులకు అశ్రు నివాళులర్పిస్తూ రాసిన పుస్తకాలు స్వెత్లాకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. సామాజిక సమస్యలు, ప్రజల కష్టాలు ఆమె రచనల్లో కనపడతాయి.