: 'బీఫ్' వివాదంపై తొలిసారి నోరువిప్పిన ప్రధాని మోదీ, ఏమన్నారంటే..!


పశుమాంసంపై జరుగుతున్న వివాదంలో తొలిసారిగా మోదీ నోరువిప్పారు. బీహార్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ తరపున ప్రచారం చేస్తూ, బిజీగా ఉన్న ఆయన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, "హిందువులు కూడా బీఫ్ తింటారు" అన్న లాలూ మాటలను గుర్తు చేస్తూ, ఆయనపై విరుచుకుపడ్డారు. "లాలూ బీహార్ ప్రజలందరినీ అవమానించారు. ముఖ్యంగా ఆయన కులస్తులైన యదు వంశీయులను... తనను పదవిలో కూర్చోబెట్టిన వారిని గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా?" అని దుయ్యబట్టారు. "యాదవులు తింటారా? ఆయనన్న మాటలు మొత్తం యాదవులు, బీహార్ ప్రజలకు అవమానం కాదా?" అని ప్రశ్నించారు. కాగా, దాద్రిలో బీఫ్ తిన్నాడని వ్యక్తిని హత్య చేసిన సంఘటనను మాత్రం మోదీ ప్రస్తావించలేదు.

  • Loading...

More Telugu News