: ఫ్యాన్స్ ని 'స్టూపిడ్ ఫెలోస్' అన్న చిరంజీవి... వీడియోను మీరూ చూడండి!
ఎప్పుడూ కూల్ గా కనిపించే మెగాస్టార్ చిరంజీవికి కోపం వచ్చింది. ఓ అభిమాని చిరంజీవి దృష్టిలో పడేందుకు పదేపదే ప్రయత్నించగా, చిరంజీవి సహనం కోల్పోయారు. ఆ అభిమానిపై అంతెత్తున ఎగిరారు. "నమస్తే అన్నాయ్ అంటూ డిస్టర్బ్ చేస్తావ్ స్టేజ్ మీద ఉన్నప్పుడు... ఎన్నిసార్లు దండం పెడతావ్? ప్రతిసారీ... నేను చూసినప్పుడల్లా ఇల్లా... (చెయ్యి ఊపుతూ) డిస్టర్బ్ చేస్తావ్... స్టూపిడ్ ఫెలోస్..." అంటూ కారెక్కి వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన 'బ్రూస్ లీ' ఆడియో వేడుక సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ దృశ్యాన్ని వీడియో తీసిన వారెవరో నిన్న దీన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఇప్పుడా వీడియో హల్ చల్ చేస్తోంది.