: కేంద్రాన్ని ప్రశ్నించకుండా జగన్ దీక్ష చేస్తే ఫలితమేంటి?: డొక్కా


వైైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రత్యేక హోదా దీక్షను టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తప్పుబట్టారు. దీక్ష పేరుతో జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగన్ దీక్ష చేస్తే ఫలితమేంటని అడిగారు. ప్రత్యేక హోదాకు, బీజేపీకి టీడీపీ మద్దతు మధ్య సంబంధమేంటని ప్రశ్నించారు. తాము మద్దతు విరమించుకుంటే జగన్ ఎన్డీఏలో చేరాలని కలలు కంటున్నారని డొక్కా విమర్శించారు.

  • Loading...

More Telugu News