: ‘బిల్లు’పై బుక్కు రాసిన ఉండవల్లి... రాష్ట్రపతికి అందజేత
రాష్ట్ర విభజనకు సంబంధించి అన్ని అంశాలతో కూడిన ఓ పుస్తకాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాశారు. ‘ఏపీ పునర్వ్యవ్యస్థీకణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిందా?’ పేరిట తాను రాసిన ఈ పుస్తకం ప్రతిని ఆయన కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మరోమారు పార్లమెంటులో చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశాన్ని తాను రాష్ట్రపతికి విన్నవించానని కూడా ఆయన చెప్పారు. పుస్తకంలో రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న చర్యలు, బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చపై పూర్తి వివరాలను పొందుపరిచానని ఉండవల్లి పేర్కొన్నారు.