: రాధేమాకు ఊరట... ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు రాధేమాకు ఊరట లభించింది. మినీ స్కర్టుల్లో కనిపించి పెను సంచలనానికి తెర తీసిన రాధేమాపై వరకట్న వేధింపుల కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం ఇప్పటికే ముంబైలోని కండీవలి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమె అరెస్ట్ ఖాయమేనన్న వాదన వినిపించింది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆమె దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో రాధేమా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేవతి మోహితే దెరె ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. రాధేమాతో పాటు ముంబై పోలీసులు, రాధేమాపై కేసు పెట్టిన మహిళ వాదనలన్నీ విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అయితే కండీవలి పోలీసులు విచారణ కోసం ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సిందేనని షరతు విధించింది.