: ఏపీ ఆన్ లైన్ సెంటరులో దర్జాగా దొంగతనం చేసిన యువతి... వీడియోను చూడండి!


ప్రజలకు వివిధ రకాల బిల్లు చెల్లింపుల నుంచి ధ్రువపత్రాల వరకూ అందించే ఏపీ ఆన్ లైన్ సెంటరుకు వచ్చిన ఓ మహిళ 'స్మార్ట్'గా దొంగతనం చేసింది. హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ పరిధిలో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాకు చిక్కింది. ఓ మహిళ క్యాష్ కౌంటరు వద్దకు వచ్చి డబ్బు తస్కరించి, దాన్ని తన హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని, దర్జాగా బయటకు వెళ్లిపోయింది. నగదు తగ్గిందని తెలుసుకున్న సెంటరు యజమాని సీసీటీవీ దృశ్యాలను చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ చేసిన దొంగతనాన్ని మీరూ చూడండి.

  • Loading...

More Telugu News