: అశ్లీలాన్ని వెతకడంలో మనమే ఫస్ట్ అట!


నిషేధమున్నా, లేకున్నా గూగుల్ లో అశ్లీలాన్ని వెతుకుతున్న వారిలో భారతీయులే ముందున్నారట. గూగుల్ ట్రెండ్ అందించిన గణాంకాల ప్రకారం 'పోర్న్' సైట్లను వెతుకుతూ, వాటిని తిలకించే వారు అధికంగా ఉన్న టాప్-10 నగరాల్లో ఆరు భారత నగరాలే ఉన్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు పూణె, ముంబై, హౌరా, బెంగళూరు ఈ జాబితాలో ఉండగా, యూపీలోని చిన్న పట్టణం ఉన్నావో 'చిన్నారుల అశ్లీలం'పై అధికంగా సెర్చ్ చేస్తున్నదట. 2008 నుంచి ఈ డేటాను కంపైల్ చేయగా, పూణె నగరం నుంచి 'యానిమల్ సెక్స్'పై అధికంగా సెర్చ్ వచ్చిందని, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల వాసులు 'రేప్ పోర్న్' అనే పదాన్ని అధికంగా వెతికారని గూగుల్ వెల్లడించింది. కాగా, ఈ గణాంకాలు పూర్తి వాస్తవం కాకపోవచ్చని, ఇండియాలో క్రిప్టోగ్రఫీ సరిగ్గా అమలు కాకపోవడం వల్ల మిగతా ప్రపంచ నగరాల వివరాలు నమోదు కాలేదని సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ నిపుణుడు అజిత్ హత్తీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News