: జగన్ కు వైద్య పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హాదాను డిమాండ్ చేస్తూ వైకాపా అధినేత జగన్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద నిన్న మధ్యాహ్నం ఈ దీక్ష ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో, జగన్ కు వైద్యులు ఈ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీని చెక్ చేయడంతో పాటు, షుగర్ లెవెల్స్, సాల్ట్ లెవెల్స్ తెలుసుకునేందుకు బ్లడ్ శాంపిల్స్ ను తీసుకున్నారు. కాసేపట్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలను వెల్లడించనున్నారు. జగన్ చేపట్టిన దీక్ష నేటితో రెండో రోజుకు చేరుకుంది.