: గులాం అలీని ముంబై వద్దంది, ఢిల్లీ రమ్మంటోంది!


శివసేన నిరసనలతో ముంబైలో జరగాల్సిన పాక్ గాయకుడు గులాం అలీ ప్రదర్శన రద్దు కాగా, "సంగీతానికి ఎల్లలు లేవు" అంటూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఆయన్ను ఆహ్వానించింది. దేశ రాజధానిలో సంగీత ప్రదర్శన చేయాలని గులాంకు కేజ్రీవాల్ ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఢిల్లీ సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ శర్మ, పాక్ గాయకుడిని తాము ఆహ్వానించామని తెలిపారు. "ఆయన్ను ముంబైకి రానివ్వలేదు. మేము ఢిల్లీ రమ్మని కోరాము. సంగీతానికి ఎల్లలు లేవు" అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. కాగా, నిన్న జరగాల్సిన గులాం అలీ కాన్సర్ట్ రద్దయిన సంగతి తెలిసిందే. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో సమావేశం తరువాత ప్రదర్శన నిర్వాహకులు కార్యక్రమం రద్దయినట్టు ప్రకటించారు. మన దేశంలో ఉగ్రవాదానికి కారణమవుతున్న పాకిస్థాన్ కు చెందిన కళాకారులను ఇటువంటి కార్యక్రమాలకు రానిచ్చేది లేదని ఉద్దవ్ స్పష్టంగా చెప్పడమే ఇందుకు కారణం.

  • Loading...

More Telugu News