: జగన్ బాబూ...‘హోదా’పై ఏనాడైనా ప్రధానితో మాట్లాడారా?: ఏపీ మంత్రి రావెల సూటి ప్రశ్న


ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షపై ఏపీ మంత్రుల మాటల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న ఏపీ కేబినెట్ లోని దాదాపు అందరు మంత్రులూ గుంటూరులోని నల్లపాడులో జగన్ చేపట్టిన దీక్షపై శివాలెత్తిపోయారు. ‘దొంగ దీక్ష, కొంగ జపం’ అంటూ దునుమాడారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు మరోమారు మీడియా ముందుకు వచ్చారు. జగన్ దీక్షపై సునిశిత విమర్శలు చేసిన రావెల ఓ సూటి ప్రశ్నను జగన్ కు సంధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏనాడైనా ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రస్తావించారా? అని ఆయన జగన్ ను నిలదీశారు. అసలు జగన్ కు దీక్ష చేసే అర్హతే లేదని ఆయన తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News