: సీమాంధ్రులే కాదు... గడువులోగా ఎవరొచ్చినా స్థానికులే: ఏపీ సర్కారు సంచలన నిర్ణయం


ఓ వైపు ‘స్థానికత’పై తెలంగాణ సర్కారు గగ్గోలు పెడుతోంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తామంటే కుదరదంటూ ‘స్థానికత’ను నిర్ధారించేందుకు ఏకంగా సమగ్ర సర్వేనే చేపట్టింది. అయితే ఇందుకు భిన్నంగా ఏపీ సర్కారు పయనిస్తోంది. సీమాంధ్రులే కాకుండా నిర్ణీత గడువులోగా తన భూభాగంలోకి ఎవరు వచ్చినా ‘స్థానికత’ను ఇచ్చేస్తామని ప్రకటించింది. అయితే అలాంటి వారు కేవలం స్థిర నివాసం మాత్రం చూపాల్సి ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు నిన్న ‘స్థానికత’పై ప్రస్తుతం ఉన్న చట్టానికి సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

  • Loading...

More Telugu News