: జాక్ పాట్ అంటే ఆమెదే...!
అదృష్టమంటే అమెరికాలో మిచిగాన్ లోని త్రీ రివర్స్ ప్రాంతానికి చెందిన జూలీ లీచ్ దే! స్థానిక ఫైబర్ గ్లాస్ కంపెనీలో సాధారణ కార్మికురాలిగా ఉన్న ఆమెను లక్ష్మీదేవి కటాక్షించింది. జూలీ ఎప్పుడో పవర్ బాల్ కు చెందిన లాటరీ టికెట్ ను కొనుగోలు చేసింది. ఈ లాటరీ టికెట్ కు జాక్ పాట్ తగిలింది. ఈ లాటరీ ద్వారా తనకు సంక్రమించిన మొత్తం చూసిన జూలీకి కళ్లు తిరిగినంత పనైంది. లాటరీలో 310.5 మిలియన్ డాలర్లు అంటే 2013 కోట్ల రూపాయలను గెలుచుకుంది. ఇంత మొత్తాన్ని గెలుచుకున్న జూలీ తొలుత ఆశ్చర్యానికి, తరువాత అయోమయానికి గురైందట. నెమ్మదిగా తన అదృష్టాన్ని తలచుకుని సంబరపడిపోయింది. ఇప్పుడు ఉన్న పళంగా ఉద్యోగం మానేసి, భర్త, పిల్లలు, మనవలు, మనవరాళ్లతో మిచిగాన్ అంతటా భవనాలు కొంటానని చెబుతోంది.