: తెలంగాణ ఉభయ సభలు నిరవధిక వాయిదా
తెలంగాణ ఉభయ సభల వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. శాసన మండలి నేటి మధ్యాహ్నానికి నిరవధిక వాయిదా పడగా, అసెంబ్లీ నేటి సాయంత్రం ముగిసింది. చివరిరోజు అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ జరిగింది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిసిన సందర్భంగా శాసనసభను నిరవధిక వాయిదా వేయాలని శాసనసభా పక్షనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ మధుసూదనాచారిని కోరారు. దీంతో శాసనసభ సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా, ఈ శాసనసభ సమావేశాల్లో ఎంఐఎం మినహా మిగిలిన విపక్షాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.