: అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు: డీకే అరుణ


టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి వీలు కానటువంటి హామీలను ఇచ్చి, వాటిని అమలు చేయడంలో మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్... ఇప్పుడు విడతలవారిగా మాఫీ చేస్తామని మోసం చేస్తున్నారని విమర్శించారు. అప్పులను తీర్చలేకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతలెవరైనా గ్రామాల్లోకి వస్తే, వారిని తరిమికొట్టాలని అన్నారు.

  • Loading...

More Telugu News