: ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అరెస్ట్
పార్లమెంటులో బీసీ బిల్లును తక్షణం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను హైదరాబాద్ పోలీసులు ఈ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. బీసీ సంఘాల నేతలు, కార్యకర్తలతో కలసి అసెంబ్లీ ముట్టడికి కృష్ణయ్య బయలుదేరడంతో వారిని ఇందిరా పార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల ప్రతినిధులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందడుగు వేయవద్దని పోలీసులు జారీ చేసిన హెచ్చరికలను నేతలు పెడచెవిన పెట్టడంతో కృష్ణయ్య సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. వారిని పోలీసు స్టేషన్ కు తరలించిన భద్రతా సిబ్బంది మిగిలిన వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.