: కిడ్నాపర్లను వదిలేసిన మావోలు
విశాఖ ఏజెన్సీలో నిన్న కిడ్నాప్ చేసిన టీడీపీ సభ్యులను విడుదల చేసినట్టు మావోయిస్టులు కబురు పంపారు. ఇన్ఫార్మర్లన్న అనుమానంతో వారిని కిడ్నాప్ చేసినట్టు మావోయిస్టులు తెలిపారు. వారిని విచారించిన అనంతరం విడుదల చేసినట్టు మావోలు వెల్లడించారు. కాగా, విశాఖపట్టణం జిల్లా ఏజెన్సీలోని జీకే వీధి మండలంలోని కొత్తగూడలో మండల టీడీపీ అధ్యక్షుడు బాలయ్య పడాల్ స్థానిక టీడీపీ నేతలు మహేష్, బాలయ్యను వారి నివాసాల నుంచి నిన్న అపహరించిన సంగతి తెలిసిందే. వారిని విడుదల చేశారని కబురందడంతో వారి కుటుంబాల్లో సంతోషం నెలకొంది.