: వారంతా చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదు?: జగన్


ప్రత్యేక హోదా గొప్పదనం ఏమిటో, దాని వల్ల వచ్చే లాభాలు ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని వైకాపా అధినేత జగన్ అన్నారు. ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసో, తెలియదో తనకు తెలియదని... ఒకవేళ తెలిసి ఉంటే చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రధాని మోదీ ముందు చంద్రబాబు మోకరిల్లారని, అందుకే ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం రాదనే బెంగతో రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు చనిపోయారని తెలిపారు. 972 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న ఏపీకి ప్రత్యేక హోదా వస్తే, మన పిల్లల కోసం లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పట్టిసీమ నుంచి పోలవరం వరకు అన్నిచోట్లా అవినీతే కనిపిస్తోందని ఆరోపించారు. ఇక్కడ తీసుకున్న లంచాల డబ్బుతో, తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని విమర్శించారు. రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం తనను మంచోడిలా చూశారని... ఆయన చనిపోయిన తర్వాత తనపై కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో కుమ్మక్కై తన మీద కేసులు పెట్టారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News