: డీఎన్ఏ గుట్టును మరింత విడమరిచిన ముగ్గురికి అత్యుత్తమ పురస్కారం
2015 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రజ్ఞులు నోబెల్ బహుమతిని పంచుకున్నారు. థామస్ లిండాల్, పాల్ మోడ్రిచ్, అజీజ్ సాంకర్ లకు సంయుక్తంగా బహుమతిని అందిస్తున్నట్టు స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి నోబెల్ కమిటీ ప్రకటించింది. డీఎన్ఏపై మరింత విస్తృతంగా పరిశోధనలు చేసి, జన్యు రహస్యాలను మరింతగా విడమరిచినందుకు గాను వీరికి ఈ అవార్డు లభించింది. కాగా ఆల్ ఫ్రెడ్ నోబెల్ కెరీర్ లో రసాయన శాస్త్రం ఎంతో కీలక పాత్ర పోషించింది. 1901 నుంచి 2014 వరకూ మొత్తం 169 మంది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు అందుకున్నారు. ఈ విభాగంలో నలుగురు మహిళలు సైతం స్థానం సంపాదించుకున్నారు.