: 53 మూడేళ్ళ తర్వాత సినిమా చూడనున్న 'ఫ్లయింగ్ సిఖ్'
1960లో ఇటలీ ఒలింపిక్స్ లో 100మీ స్ప్రింట్ లో నాలుగో స్థానంలో నిలిచి భారత్ కు సముచిత గుర్తింపు తెచ్చిపెట్టిన మహోన్నత అథ్లెట్ మిల్కా సింగ్ తాజాగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. గత ఐదు దశాబ్దాల నుంచి సినిమా థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడని ఈ సర్దార్జీ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఓ సినిమా చూసేందుకు సై అంటున్నాడు. ఇంతకీ ఆ సినిమా కూడా మిల్కా సింగ్ జీవితం ఆధారంగా నిర్మితమైందే. ఆ చిత్రం పేరు 'భాగ్ మిల్కా భాగ్'. హీరోగా ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నాడు.
కాగా, కామన్వెల్త్ క్రీడల్లో తొలి అథ్లెటిక్ స్వర్ణం సాధించిన భారత స్ప్రింట్ వీరుడిగా చరిత్రలో నిలిచిపోయిన మిల్కా సింగ్.. సినిమా చూసి ఇప్పటికి 53 ఏళ్ళయింది. ఆయన చివరిసారిగా 'అన్ మోల్ గాడీ' అనే చిత్రాన్ని వీక్షించారు. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో సురయ్యా, నూర్జహాన్ ప్రధాన పాత్రలు పోషించారు.
కాగా, మళ్ళీ ఇన్నాళ్ళకు థియేటర్ కు వెళ్ళేందుకు రెడీ అవుతోన్న మిల్కా.. అప్పట్లో రాజ్ కపూర్ సినిమాలు ఎక్కువగా చూసేవాణ్ణని చెప్పుకొచ్చారు. కాగా, 'భాగ్ మిల్కా భాగ్' లో మిల్కా పాత్రను ఫర్హాన్ అక్తర్ పోషిస్తుండగా.. సోనమ్ కపూర్ కథానాయికగా నటించింది. రాకేశ్ మెహ్రా దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం జులై 12న విడుదల కానుంది.