: పవన్ ఫ్యాన్స్ కు వర్మ మరో ట్వీట్ రిటార్ట్


పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు, రామ్ గోపాల్ వర్మకు మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది. కల్యాణ్ ఆడియో ఫంక్షన్లలో హడావుడి చేసే ఫ్యాన్స్ లెక్కలు చూసుకుంటే సోషల్ మీడియాలో మహేశ్ బాబును అనుసరించే ఫ్యాన్సే ఎక్కువ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, రామ్ గోపాల్ వర్మ ఫోటోకు దండలేసి, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ (RIP) అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై వర్మ మరోసారి స్పందించాడు. తన 'రిప్' ఇమేజ్ లో వాడిన భాషను చూస్తే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంత చదువరులో అర్థమవుతుందని పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంత రైతులకు సాయం చేయడం కంటే ముందు ఫ్యాన్స్ కోసం స్కూల్స్ ఏర్పాటు చేయాలని పనిలోపనిగా విమర్శించాడు. తన ఇంగ్లిష్ ట్వీట్స్ ను మహేశ్ బాబు అభిమానులు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అనువదించగలరని సూచించాడు. తన అభిమానులు అనాగరికంగా మాట్లాడడం చూసి కల్యాణ్ సిగ్గుపడకుండా వ్యవహరించాలని వర్మ తెలిపాడు. అలాగే పవన్ ఫ్యాన్స్ వారి ఊహల్లో తనను చంపగలరు కానీ, తన ఊహలను చంపలేరని వర్మ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News